
వర్షాకాలం వచ్చిదంటే చాలు.. జలుబు.. జ్వరం.. దగ్గు.. ఇలాంటివి జనాలను పీడిస్తాయి. రైనీ సీజన్ అంటే చాలు జనాలు ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడంతో అనేక రకాల వ్యాధులు వస్తాయి. అందుకే వర్షా కాలంలో ఫిట్ గా ఉండేందుకు.. ఇన్ ఫెక్షన్ల బారి నుంచి రక్షణ పొందేందుకు ఎక్కువుగా ఫ్రూట్స్ తినాలి. మరీ ముఖ్యంగా 5 రకాల పండ్లను తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..!
ఆపిల్ : వీటిలో విటమిన్ సి, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తితో శరీరానికి శక్తిని ఇస్తాయి . వర్షాకాలంలో ఆపిల్ తినడం వల్ల బ్యాక్టీరియా .. వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.
పియర్ : బేరి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వీటిలో ఫైబర్ , విటమిన్ సి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి .. వర్షాకాలంలో కడుపు సమస్యల బారి నుండి కాపాడుతుంది.
దానిమ్మ : ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తహీనతను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దానిమ్మ తినడం వైరల్ .. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు ఇవి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ప్రయాణాల్లో దానిమ్మ గింజలకు బాక్స్ లో తీసుకెళ్లి తింటే చాలా అనుభూతి కలుగుతుంది.
బొప్పాయి : బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . ర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు శరీరం లో పేరుకుపోయిన విషాన్ని తొలగిస్తాయి . చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
రేగి పండ్లు: రేగి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి .. ఐరన్ ఉంటాయి, ఇవి వర్షాకాలంలో శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరం శక్తివంతంగా ఉంటుంది.
పండ్లు తినేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!
- వర్షాకాలంలో ఏదైనా పండు తినే ముందు, దానిని నీటితో బాగా కడగాలి.
- కట్ చేసిన పండ్లను ఎక్కువసేపు బయట పెట్టవద్దు.అలా ఉంచితే కూలింగ్ క్లైమేట్ కు వాటిలోబ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది.
- సీజన్ ఫ్రూట్స్ ను ఫ్రెష్ గా ఉండే వాటిని తినండి. ఎక్కువ నిల్వ ఉంచిన పండ్ల జోలికి అసలు వెళ్లవద్దు.
- పండ్లు తినడం వల్ల అలెర్జీ .. కడుపు నొప్పి .. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
- అన్నిటికంటే ముఖ్యంగా పండ్లుకాని.. ఏ ఇతర పదార్థాలు తినేటప్పుడు చేతులను శుభ్రంగా వాష్ చేసుకోండి. మురికిచేతులతో అస్సలు ముట్టుకోవద్దు. మీ పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి.