ఆరేండ్లు ఉంటేనే 1వ తరగతిలో అడ్మిషన్

ఆరేండ్లు ఉంటేనే 1వ తరగతిలో అడ్మిషన్

న్యూఢిల్లీ:  పిల్లల వయస్సు 6 ఏళ్లు ఉంటేనే1వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాతీయ విద్యావిధానం 2020 కింద స్కూళ్లల్లో జాయిన్ అయ్యే పిల్లల వయస్సును నిర్ణయించినట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి తాజా నిబంధనను  తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది.