రాజ్‌కుంద్రా కేసులో మరో బాలీవుడ్ నటికి సమన్లు

V6 Velugu Posted on Jul 26, 2021

  • మరికొందరు మెడకు చుట్టుకుంటున్న పోర్నోగ్రఫీ కేసు

ముంబయి: బాలీవుడ్ ను షేక్ చేస్తున్న రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. పోర్నోగ్రఫీ కేసులో మరికొందరికి సంబంధాలున్నాయన్న గుసగుసలకు బలం చేకూర్చే ఘటన సోమవారం జరిగింది. రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టిని విచారించిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తాజాగా నటి షెర్లిన్‌ చోప్రాకు సమన్లు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాతోపాటు 11 మందిని ఇప్పటికే అరెస్టు చేసి విచారణ జరుపుతున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్ తాజాగా బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ చేయడంతో ఈ వ్యవహారంతో అనేక మందికి లింకులున్నాయన్న అనుమానాల కలిగిస్తోంది. షెర్లిన్ చోప్రాను విచారించిన అనంతరం ఆమె ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా మరికొందరు బాలీవుడ్ ప్రముఖులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రాను వెంటబెట్టుకుని శిల్పాశెట్టిని.. వార ఇల్లు.. కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు చేసి భారీ ఎత్తున నిల్వ చేసిన వీడియో, ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు వాటికి సంబంధాలున్న వారిని విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 


 

Tagged Bollywood, Raj Kundra, pornography, bollywood hot, Shilpasetty

Latest Videos

Subscribe Now

More News