
సీఎం కేసీఆర్పై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగేండ్లుగా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలైన ఏ ఎమ్మెల్యే కి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఉప ఎన్నికలు వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. రోడ్లు, డ్రైనేజీ పనులు కుంటుపడ్డాయని..తన రాజీనామాతో పెండింగ్ పనులు మొత్తం పూర్తవుతున్నాయన్నారు. రాష్ట్రాభివృద్ది బీజేపీ తోనే సాధ్యం అని నమ్మి కమలం పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పారు.
మునుగోడు నియోజకవర్గంలో ఇవాళ టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట్, పోచంపల్లి క్రాస్ రోడ్స్, చౌటుప్పల్, నారాయణ్ పూర్, చల్మెడ మీదుగా మునుగోడుకు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ నేరుగా వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక రూట్‌ను సిద్ధం చేశారు.