
బాలయ్య హీరోయిన్ సోనాల్ చౌహాన్‌కు క్రేజీ ఆఫర్ దక్కింది. బాలయ్యతో లెజెండ్, డిక్టేటర్ వంటి సినిమాల్లో ఈ బ్యూటీ నటించింది. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్‌లోనూ మెరిసింది. అయినా ఆమె ట్యాలెంట్‌కు తగిన గుర్తింపు పొందలేకపోయింది. కానీ, గ్లామర్ పరంగా సోనాల్ మంచి మార్కులే కొట్టేసింది. ఇన్నేళ్ల పాటు ఒక్క హిట్ లేకుండా వెయిట్ చేసిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు టైమొచ్చింది.
ఏకంగా రాజమౌళి– మహేశ్కాంబోలో వస్తున్న ఓ సినిమాలో చాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ఇందులో ఓ కీలకమైన రోల్ కోసం జక్కన్న టీం సోనాల్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. అడిగింది రాజమౌళి కావడంతో ఈ హీరోయిన్ ఎగిరిగంతేసి మరీ ఓకే చెప్పిందని సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాతోనైనా సోనాల్ దశ తిరుగుతుందేమో చూడాలి మరి.