RRRలో సీత పాత్ర చేసేంత సీన్ ఆలియాభట్ కు ఉందా..?

RRRలో సీత పాత్ర చేసేంత సీన్ ఆలియాభట్ కు ఉందా..?

హైదరాబాద్ : ఆర్ఆర్ఆర్ సినిమా అప్ డేట్స్ , కన్ ఫర్మేషన్స్ గురించి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. “ఆలియాభట్ ఇప్పటివరకు పేరున్న పాత్రలు చేయలేదు…. ఆమెకు నటిగానూ పెద్దగా పేరు లేదు కదా..అలాంటి ఆమెను రామరాజు భార్య(కల్పిత పాత్ర) సీతలాగా ఎలా ఎంచుకున్నారు” అన్న ప్రశ్నకు వివరణ ఇచ్చారు రాజమౌళి.

ఎప్పుడైనా చేసిన పాత్రలు, నటన యాక్టర్లను హైలైట్ చేస్తాయన్నారు రాజమౌళి. ఇప్పటివరకు చేసిన పాత్రల గురించి ఆలోచించలేదన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియాభట్ పాత్ర అప్పటివరకు ఉన్న కథను మలుపు తిప్పుతుందన్నారు. ఆ పాత్ర సినిమాకు చాలా కీలకం అన్నారు రాజమౌళి.

ఆర్ఆర్ఆర్ సినిమాలో తాను భాగం అయినందుకు సంతోషంగా, కృతజ్ఞతగా భావిస్తున్నానని ఆలియాభట్ చెప్పింది. ఈ భారీ ప్రాజెక్టులో, భారీ తారాగణంతో కలిసి జర్నీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నానని చెప్పింది. అవకాశం ఇచ్చిన దర్శకుడు రాజమౌళికి థాంక్స్ చెప్పింది.