ప్రేమలు చిత్రం తెలుగులో విడుదల

ప్రేమలు చిత్రం తెలుగులో విడుదల

‘ప్రేమలు’ చిత్రం మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. తెలుగులోనూ అంతే గొప్ప స్పందనను అందుకుంటోంది అన్నారు దిల్ రాజు. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలై మెప్పించిన ఈ సినిమాను  రాజమౌళి కొడుకు ఎస్.ఎస్.కార్తికేయ శుక్రవారం తెలుగులో విడుదల చేశారు. 

ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో దిల్ రాజు మాట్లాడుతూ ‘మలయాళ సినిమా అయినప్పటికీ కథంతా హైదరాబాద్‌‌లో జరుగుతుంది.  ఆదిత్య తెలుగులో డైలాగులను అద్భుతంగా రాశాడు. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.కార్తికేయ, ఆదిత్య కూడా మాట్లాడారు.