Rajamouli: 110 ఏండ్ల చ‌రిత్ర ఉన్న ఆ మ్యూజికల్ సంస్థ..ఆర్ఆర్ఆర్ సినిమాని నాట‌కంగా వేసింది: రాజమౌళి

Rajamouli: 110 ఏండ్ల చ‌రిత్ర ఉన్న ఆ మ్యూజికల్ సంస్థ..ఆర్ఆర్ఆర్ సినిమాని నాట‌కంగా వేసింది:  రాజమౌళి

టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli). టాలీవుడ్ లో తనదైన మూవీస్ తో ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.బాహుబలి, బాహుబలి 2,ఆర్ఆర్ఆర్(RRR) వంటిసినిమాలతో గ్లోబల్ లెవల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. RRR మూవీ 2021లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవ‌డ‌మే కాకుండా ఆస్కార్,గోల్డెన్ గ్లోబల్ వంటి పలు ఇంటర్నేషనల్  అవార్డులను గెలుచుకుంది. 

ప్రస్తుతం రాజమౌళి జపాన్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో సంవత్సన్నర కాలంగా రన్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగా మార్చ్ 18న ఆర్ఆర్ఆర్ మూవీని జ‌పాన్‌లో స్పెషల్ షోస్ వేశారు. ఇక స్క్రీనింగ్ కోసం రాజమౌళి కుటుంబం జ‌పాన్ వెళ్లి అక్క‌డి ప్ర‌జ‌ల‌తో ముచ్చటిస్తూ ఉంది. ఇదిలావుంటే ఆర్​ఆర్​ఆర్ మూవీ జ‌పాన్‌లో అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నట్లు రాజ‌మౌళి ఎక్స్ వేదిక‌గా తెలిపారు. 

'110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ(Takarazuka company) RRRసినిమాని ఒక సంగీత నాట‌కంగా తీర్చిదిద్ద‌డం ఎంతో గర్వంగా ఉంది. RRR సినిమాను నాటకంగా స్వీకరించినందుకు జపనీస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ స్పందన చూసి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ గొప్ప నాటకాన్ని ప్ర‌ద‌ర్శించిన అమ్మాయిల ఉత్సాహం, ప్రతిభకి వాళ్ళని ఎంత పొగిడినా త‌క్కువే..అరిగాటో గోజైమాసు (ధన్యవాదాలు) అంటూ రాజ‌మౌళి రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.