
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)కి అరుదైన గౌరవం దక్కింది. ఐఎస్‌బీసీ సంస్థ తమ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షుడిగా రాజమౌళిని ఎంచుకుంది. ఐఎస్‌బీసీ సంస్థ గ్రామీణ స్థాయి నుంచి క్రికెటర్స్ లో ప్రతిభను ప్రోత్సహించేందుకు రూపొందించబడింది. అతి త్వరలోనే ఐఎస్‌బీసీ (ISBC) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు రాజమౌళి.
ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ఈ క్రమంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారు. ఇక తాజాగా ఐఎస్‌బీసీ (ISBC) చైర్మన్‌గా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు రాజమౌళి.