కల్కి సినిమాపై రాజమౌళి సూటి ప్రశ్న.. కౌంటర్స్ వేస్తున్న నెటిజన్స్

కల్కి సినిమాపై రాజమౌళి సూటి ప్రశ్న.. కౌంటర్స్ వేస్తున్న నెటిజన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా భారీ సినిమా కల్కి 2898 AD(Kalki 2898 AD). స్కైఫై, సైన్స్ ఫిక్షన్ అండ్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ అండ్ ఫిస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ కల్కి ఫస్ట్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ గ్లింప్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఇక తాజాగా దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కూడా కల్కి గ్లింప్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు రాజమౌళి. "రియల్లీ గ్రేట్ జాబ్ నాగి. భవిష్యత్తుకు సంబంధించిన అద్భుతమైన సినిమాని తీస్తున్నావు. ఇది చాలా కష్టం కానీ..  మీరు చేసి చూపించారు. డార్లింగ్ ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయి. కానీ నాకు ఒక ప్రశ్న ఉంది. కల్కి 2898 AD రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. 

ఇక రాజమౌళి చేసిన ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ తమ స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ గురించి నువ్వు అడుగుతున్నావా జక్కన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  నిజానికి రాజమౌళి సినిమాలి అనుకున్న సమయం కన్నా చాలా లేట్ గా రిలీస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మ్యాటర్ నే ప్రస్తావిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.