
వేములవాడ, వెలుగు : చంద్రగ్రహణం నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఈనెల7న ఉదయం 11.25 నిమిషాల తర్వాత మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం 3:45 గంటల నుంచి సంప్రోక్షణ కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం మంగళవాయిద్యాలు, సుప్రభాతం, ప్రాత:కాల పూజలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.