రాజాసాబ్ కథ ఇదేనా.. మరి సమాజం యాక్సెప్ట్‌ చేస్తుందా?

రాజాసాబ్ కథ ఇదేనా.. మరి సమాజం యాక్సెప్ట్‌ చేస్తుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం సలార్(Salaar) సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న  తాజా చిత్రం రాజాసాబ్ మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అంతేకాదు.. ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా ఆడియన్స్ నుండి మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రాజాసాబ్ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో అంచనాలు పెరుగుతున్నాయి. 

అయితే.. ప్రభాస్, మారుతీ కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ రాగానే హారర్ అండ్ కామెడీ నేపధ్యంలో ఈ సినిమా రానుందని వార్తలు బలంగా వినిపించాయి. దానికి కారణం ఆ జానర్ లో మారుతిగా మంచి పట్టు ఉండటమే. ఆయన తీసిన ప్రేమ కథా చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆయనకీ అచ్చొచ్చిన జానర్ నే డార్లింగ్ కోసం సిద్ధం చేశాడట దర్శకుడు మారుతీ.

అయితే తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ సినిమా సంస్థ ఐఎమ్‌డీబీ తన వెబ్ సైట్ లో ఈ సినిమా కథ ఇదే అంటూ రాసుకొచ్చింది.. రాజాసాబ్ సినిమాలో ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడుతారు. కానీ, నెగెటివ్‌ ఎనర్జీ వల్ల వాళ్ళు తమ గమ్యాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.. అంటూ సినిమా కథను రాసుకొచ్చింది. ఇది చూసిన దర్శకుడు మారుతి ట్విటర్‌ స్పందిస్తూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అరెరె... ఈ విషయం నాకు తెలియక వేరే స్క్రిప్ట్‌తో సినిమా చేస్తున్నాను! ఇప్పుడు ఐఎమ్‌డీబీ సమాజం నన్ను యాక్సెప్ట్‌ చేస్తదా? అంటూ నవ్వుతున్న ఎమోజీ యాడ్ చేశాడు. ప్రస్తుతం మారుతీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.