ఇండియాలో ఫస్ట్ AI ట్రాఫిక్ సిగ్నల్ : ఈ సైరన్స్ విన్నా.. ట్రాఫిక్ ఎటు ఎక్కువ ఉంటే అటు గ్రీన్ సిగ్నల్

ఇండియాలో ఫస్ట్ AI ట్రాఫిక్ సిగ్నల్ : ఈ సైరన్స్ విన్నా.. ట్రాఫిక్ ఎటు ఎక్కువ ఉంటే అటు గ్రీన్ సిగ్నల్

AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది.. అందరికీ అందుబాటులోకి రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది.. చూద్దాంలే.. చేద్దాంలే అని ఆలోచన చాలా మందిలో ఉంది. ఇక నుంచి అలాంటి ఆలోచన మానుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితంలో భాగం అయిపోయింది అనటానికి ఇండియాలోని ఈ ఘటనే ఎగ్జాంపుల్. రోడ్డెక్కితే ట్రాఫిక్.. ట్రాఫిక్.. ఇది అందరికీ కామన్. ఇలాంటి ట్రాఫిక్ విభాగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది.. ట్రాఫిక్ సిగ్నల్స్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటీ అంటారా.. అదే ఇప్పుడు మీరు పూర్తి తెలుసుకోబోయే వార్త.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఉంది కదా.. ఇది నిజం కూడా అవుతుంది.. 

రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ సిటీ. ఈ నగరంలోని ట్రాఫిక్స్ సిగ్నల్స్ కు AI.. ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం చేశారు. జంక్షన్ దగ్గర అధునాతనమైన కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలు సెన్సార్ లతో పని చేస్తాయి. జంక్షన్ చుట్టూ నాలుగు లైన్లు ఉంటాయి కదా.. ఈ నాలుగు లైన్లలోని ట్రాఫిక్ రద్దీని కెమెరాలు చూస్తూ ఉంటాయి. ఎటు వైపు రద్దీ ఎక్కువగా ఉంది అనే సెన్సార్ల ద్వారా గుర్తించి.. అటు వైపు ఆటోమేటిక్ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 

ALSO READ : అనిల్ అంబానీ సంస్థపై ఈడీ దూకుడు..

ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే.. లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ రద్దీగా ఉంది.. రైట్ సైడ్ ట్రాఫిక్ తక్కువగా ఉంది. మామూలుగా అయితే ట్రాఫిక్ ఎలా ఉన్నా ఆల్టర్ నేట్ గా సిగ్నల్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్న సిగ్నల్ వ్యవస్థ. కొత్తగా వచ్చిన AI ట్రాఫిక్ సిగ్నల్స్.. ఇలాంటి ఆటోమేటిక్ సిస్టమ్ కింద పని చేయదు. ఎటు వైపు రద్దీ ఎక్కువగా ఉందో అటు వైపు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సో.. జంక్షన్ దగ్గర ఇక నుంచి 30 సెకన్లు.. 60 సెకన్లు.. 90 సెకన్లు అనే టైం డ్యూరేషన్ ఉండదు.. రద్దీ ఎటువైపు ఎక్కువగా ఉంటే అటు వైపు ముందుగా క్లియర్ చేస్తుంది. ఆ తర్వాతనే మిగతా లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 

మరి ఎమర్జన్సీ సర్వీసుల సంగతి ఏంటీ అని డౌట్ రావొచ్చు.. అదేనండీ అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలు, పోలీస్ పెట్రోలింక్ వెహికల్స్ ఇలాంటివి ఏంటీ అంటారా.. ఆయా వాహనాలు ఇచ్చే సైరన్స్.. ఆయా వాహనాలపై ఉండే లైట్లు ఆధారంగా.. ఆటోమేటిక్ గా ఆ లైన్.. ఆ రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సో.. నో ప్రాబ్లమ్ అన్నమాట.. 

రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ సిటీలో.. 2025, అక్టోబర్ 11వ తేదీన ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు. ఒక్కో జంక్షన్ లో AI ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయటానికి 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని.. ఉదయ్ పూర్ సిటీ ట్రాఫిక్ డీఎస్పీ అశోక్ అంజనా వెల్లడించారు. మరి ఉదయ్ పూర్ వరకు వచ్చిన AI ట్రాఫిక్ సిగ్నల్స్.. మన హైదరాబాద్ సిటీకి రావటం ఎంతోసేపు పట్టదు కదా.. ఇలా దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇలాంటి ఏఐ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రోడ్లపై రద్దీని మెరుగ్గా, సమర్థవంతంగా నిర్వహించటం అధికారులకు కూడా సులభతరం అవుతుంది.