గెహ్లాట్ ఆ రెండు కేసులు దాచిపెట్టిండు.. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

 గెహ్లాట్ ఆ రెండు కేసులు దాచిపెట్టిండు.. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసుల సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ నాయకులు  చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌   ప్రవీణ్ గుప్తాకు ఫిర్యాదు చేశారు.  

అనంతరం షెకావత్ విలేకరులతో మాట్లాడుతూ, అశోక్ గెహ్లాట్ నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనపై ఉన్న రెండు తీవ్రమైన నేరాలతో సంబంధం ఉన్న రెండు కేసులను పేర్కొనలేదని అన్నారు.  

గెహ్లాట్ పై రెండు కేసులు ఉన్నాయి, ఒకటి భూ కుంభకోణం.  ఇంకొకటి లైంగిక నేరం, ఇది ఆయనకు తెలుసు, కానీ అతను తన అఫిడవిట్‌లో వీటి గురించి వెల్లడించలేదు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125A ప్రకారం ఇది గుర్తించదగినది. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం అని షెకావత్  అన్నారు.  

కాగా  గెహ్లాట్ రాజస్థాన్‌లోని సర్దార్‌పురా అసెంబ్లీ నియోజకవర్గానికి తన నామినేషన్‌ను సమర్పించారు. రాజస్థాన్‌లో నవంబర్ 25న ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య కీలక పోరు జరగనుంది.