అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్తోంది: బీజేపీ

అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్తోంది: బీజేపీ

గవర్నర్‌‌తో భేటీ అయిన బీజేపీ నేతలు

జైపూర్‌‌: రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం వైపు నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. గవర్నర్‌‌ కల్‌రాజ్‌ మిశ్రాతో శనివారం బీజేపీ డెలిగేషన్‌ భేటీ అయింది. అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌‌ను రాజ్యాంగ పరంగా పనిచేయకుండా కాంగ్రెస్‌ నేతలు ఒత్తిడి చేస్తున్నారని బీజేపీ స్టేట్‌ చీఫ్‌ సతీశ్‌ పూనియా అన్నారు. “అసెంబ్లీ నిర్వహించాలంటే ఒక పద్ధితి ఉంటుంది. దాన్ని ఫాలో అవకుండా కావాలనే రాద్దాంతం చేస్తున్నారు. ముందు కరోనా మీద ఫోకస్‌ చేయండి” అని బీజేపీ నేతలు అన్నారు. అసెంబ్లీ సెషన్‌ నిర్వహించాలని కేబినెట్‌కు అడిగే హక్కు ఉందని, దానికి సరైన రీజన్‌ చెప్పాలని కానీ దానికి సరైన రీజన్‌ ఉండాలని, కాంగ్రెస్‌ ఆ రీజన్‌ చెప్పడం లేదని బీజేపీ నేతలు అన్నారు. అసెంబ్లీ సెషన్‌ నిర్వహించాలని అడిగే పద్ధితి ఇది కాదని, గొడవలు ధర్నాలు చేయకూడదని బీజేపీ నేత కటారియా అన్నారు. ఈ రకంగా చేస్తే అసెంబ్లీలో సీఆర్‌‌పీఎఫ్‌ పోలీసులతో సెక్యూరిటీ పెట్టాలని అన్నారు. హైకోర్టులో సచిన్‌పైలెట్‌కు అనుకూలంగా తీర్పు రావడంతో గెహ్లాట్‌, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్‌ నిర్వహించాలని గవర్నర్‌‌ను డిమాండ్‌ చేశారు. వాళ్లంతా రాజ్‌భవన్‌కు వెళ్లి లాన్‌లో ధర్నా చేశారు. దీంతో వారిపై బీజేపీ ఈ ఆరోపణలు చేసింది.