Rahul Dravid: రాజస్థాన్ జట్టులో గందరగోళం.. ఒక్క సీజన్‌కే కోచ్ పదవి నుంచి తప్పుకున్న ద్రవిడ్

Rahul Dravid: రాజస్థాన్ జట్టులో గందరగోళం.. ఒక్క సీజన్‌కే కోచ్ పదవి నుంచి తప్పుకున్న ద్రవిడ్

ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గుడ్ బై చెప్పాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ 2026 కి ముందు జట్టుతో కొనసాగరని రాజస్థాన్ ఫ్రాంచైజీ శనివారం (ఆగస్టు 30) ధృవీకరించింది. దీంతో అనుభవమున్న ద్రవిడ్ లేకపోవడం ఐపీఎల్ 2026కి లేకపోవడంతో రాజస్థాన్ కు ఊహించని తగిలింది. సెప్టెంబర్ 6, 2024న ద్రవిడ్ తో రాజస్థాన్ రాయల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క సీజన్ కే ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పాడు. 

"రాయల్స్ జట్టు ప్రయాణంలో రాహుల్ చాలా సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం ఒక తరం ఆటగాళ్లను ప్రభావితం చేసింది. జట్టులో బలమైన విలువలను నిర్మించింది. ఫ్రాంచైజీ సంస్కృతిపై చెరగని ముద్ర వేసింది. రాహుల్‌కు ఫ్రాంచైజీలో విస్తృత స్థానం ఆఫర్ చేయబడింది. కానీ ఆ పదవిని ఆయన వద్దనుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు రాహుల్ ఫ్రాంచైజీకి చేసిన అద్భుతమైన సేవకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు." అని రాజస్థాన్ ప్రకటనలో తెలియజేసింది. 

ద్రవిడ్ కు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య చక్కని అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తరపున కెప్టెన్ గా ఆడిన ఈ మాజీ భారత ప్లేయర్.. 2013లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ కు జట్టును ఫైనల్ కు చేర్చాడు. 2012, 2013లో సీజన్‌లలో రాయల్స్ కెప్టెన్ గా ఉన్నాడు. 2014, 2015లో రాజస్థాన్ జట్టు మెంటార్ గా ఉన్నాడు. ఆ తర్వాత టీమిండియా అండర్ 19 జట్టుకు కోచింగ్ ఇవ్వడం.. నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ అయ్యాడు. నవంబర్ 2021లో రవిశాస్త్రి స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.

ALSO READ : బెంగుళూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‎గ్రేషియా ప్రకటించిన ఆర్సీబీ

గత సీజన్ (ఐపీఎల్ 2025) రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 మ్యాచ్ ల్లో కేవలం నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో నిలిచింది. ఇప్పటికే కెప్టెన్ సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో విడిపోతున్నాడంటూ వార్తలు వస్తున్న సమయంలో ద్రవిడ్ రాజీనామా చేయడం ఆ జట్టుకు కోలుకోలేని షాక్.