RR vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. ఆర్సీబీ జట్టులో కొత్త కుర్రాడు 

RR vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. ఆర్సీబీ జట్టులో కొత్త కుర్రాడు 

ఐపీఎల్ లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీ తుమీ తేల్చుకోనుంది. జైపూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు బెంగళూరు ఆల్ రౌండర్ సౌరవ్ చౌహన్ కు అవకాశమిచ్చింది. ఇప్పటివరకు రాజస్థాన్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచింది. మరోవైపు బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఒకటే మ్యాచ్ లో గెలిచింది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): 

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్