ఈ సారైనా రాజస్థాన్ రాయల్స్ దశ తిరిగేనా?

ఈ సారైనా  రాజస్థాన్ రాయల్స్ దశ తిరిగేనా?

ఐపీఎల్ తొలి సీజన్ (2008)లో విజేతగా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. కోచ్‌‌‌‌గా, కెప్టెన్ గా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ జట్టుకు మొదటి సీజన్‌‌‌‌లోనే సక్సెస్ అందించాడు. కానీ ఆ తర్వాత ఆ టీమ్‌‌‌‌ ఆట, రాత మొత్తం మారింది. టైటిల్‌‌‌‌ నెగ్గిన తర్వాత కేవలం మూడుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్ చేరి అంచనాల్ని అందుకోలేకపోయింది. చివరిసారిగా 2018లో టాప్–4లో నిలిచింది. గత మూడేళ్లుగా అయితే చివరి రెండు ప్లేస్ లకే పరిమితమైన రాయల్స్ రెండో టైటిల్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉంది. మెగావేలంలో కొత్త  ప్లేయర్లను టీమ్ లోకి తీసుకున్న రాయల్స్ ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది. గ్రూప్‌‌‌‌–ఎలో ఉన్న రాజస్తాన్‌‌‌‌ ఈ నెల 29న సన్ రైజర్స్ హైదరాబాద్‌‌‌‌తో పోరుతో తన పోరు ఆరంభించనుంది.  

వేలానికి ముందు కెప్టెన్ సంజూ శాంసన్ (రూ.14 కోట్లు), జాస్ బట్లర్ (రూ.10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ. 4 కోట్లు)ను రిటైన్ చేసుకున్న రాజస్థాన్ టీమ్.. మెగా ఆక్షన్ లో స్టార్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్ లతో పాటు ప్రసిధ్ కృష్ణ, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్ లాంటి ఇండియా ప్లేయర్లను తీసుకుని బ్యాటింగ్, బౌలింగ్ లో బలం పెంచుకుంది. ఓపెనర్లుగా బట్లర్ తో పాటు జైస్వాల్ లేదా పడిక్కల్ లో  ఒకరు బరిలో దిగనుండగా.. మూడో నంబర్ లో సంజూ బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. దీంతో టాపార్డర్ బలంగానే కనిపిస్తోంది. టీమిండియాకు ఎన్నో విజయాల్ని అందించిన స్పిన్ ద్వయం అశ్విన్, చహల్ ఈ టీమ్ కు పెద్ద ప్లస్. పేస్ బౌలింగ్ లో ప్రసిధ్, నవదీప్ సైనీ వంటి యంగ్ ఇండియా పేసర్లతో పాటు న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ ట్రెంట్ బౌల్ట్ రూపంలో అపోనెంట్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సమర్థులు ఉన్నారు. శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ పేస్ బౌలింగ్ కోచ్ గా ఉండటం వీరికి కలిసొచ్చే అంశం. అయితే, రాజస్తాన్ మిడిలార్డర్​ అంత బలంగా కనిపించడం లేదు.  టీ20ల్లో కీలకమైన ఆల్‌‌‌‌రౌండర్లు ఎక్కువగా లేకపోవడం మైనస్​ అనొచ్చు. అలాగే, కెప్టెన్​ శాంసన్ నిలకడలేమి రాయల్స్ ను కలవరపెడుతోంది.