
- హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన అడ్వకేట్లు
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ స్పెషల్ సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన రజత్ కుమార్ అవినీతి పాల్పడ్డారని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్లు ఆరోపించారు. ఆయన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ సీఎంకు ఫిర్యాదు చేసేందుకు బుధవారం సెక్రటేరియెట్‌కు వచ్చారు. సీఎం లేకపోవ డంతో సీఎస్ ఆఫీస్‌లో ఫిర్యాదు అందజే శారు. ఇరిగేషన్ స్పెషల్ సీఎస్‌గా ఉన్నపుడు రజత్ కుమార్ పై డీవోపీటీకి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని అడ్వకేట్ రాజేశ్ మీడియాకు తెలిపారు.
ఇటీవల తనపై వచ్చిన కథనాలను యూట్యూబ్‌లో నిలుపుదల చేయాలని కోరుతూ రజత్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆయనకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిం దన్నారు. ఢిల్లీ హైకోర్టులో రజత్ కుమార్ పై ఇప్పటికీ కేసు కొనసాగుతున్నదని తెలిపారు. ఆయన అవినీతిపై తెలంగాణ హైకోర్టులో ఇంప్లిడ్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు.