వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: రాజేశ్​బాబు

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: రాజేశ్​బాబు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : న్యాయవాదుల కుటుంబాలు, కోర్టు సిబ్బంది వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి రాజేశ్​బాబు కోరారు. శనివారం పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ, మానసిక పటుత్వాన్ని కోల్పోకుండా చూసుకోవాలని సూచించారు. శుభకార్యాలు, వేడుకలకు, డీజే సౌండ్లకు దూరంగా ఉండాలన్నారు. 

గొడవలకు దిగుతూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, నడక, వ్యామమం, యోగా పాటించాలని కోరారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్య నిపుణులను సంప్రదించాలని కోరారు. మండలంలోని వెంకటాపూర్  గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి సబిత, మౌనిక, డీఎంహెచ్​వో సుధాకర్ లాల్, డాక్టర్లు నీరజ్, శివప్రసాద్, కీర్తన పాల్గొన్నారు.