సూపర్స్టార్ అంటే నచ్చదు.. దయచేసి తీసేయండి

సూపర్స్టార్ అంటే నచ్చదు.. దయచేసి తీసేయండి

తమిళ స్టార్ హీరో రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ జైలర్(Jailer). సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మిస్తున్న ఈ సినిమాను నెల్సన్ కుమార్(Nelson kumar) తెరకెక్కిస్తున్నాడు. తమన్నా(Thamannaah) హీరోన్ గా నటిస్తున్న ఈ సినిమా.. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జైలర్ సినిమా ఆడియో ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సంధర్బంగా రజినీకాంత్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. నాకు సూపర్ స్టార్(Superstar) అనే పదం నచ్చదు. జైలర్ సినిమాలో కూడా ఒక పాటలో సూపర్ స్టార్ అనే పదాన్ని వాడారు దయచేసి దాన్ని తొలగించండి. ఇక నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఆల్కాహాల్ కు అలవాటు పడటం. అలా అన్ని మిమ్మల్ని పూర్తిగా మానేయమని నేను చెప్పడంలేదు. కొన్ని ఆనందకరమైన, సంతోషకరమైన సందర్భాలు ఉంటాయి. అలాంటి సమయాల్లో మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అలాకాకుండా.. మద్యానికి బానిస అవడం అనేది మన ఆరోగ్యానికి హానికరం అంటూ చెప్పుకొచ్చారు రజిని. ప్రస్తుతం రజిని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. '

ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మళయాళ స్టార్ మోహన్ లాల్(Mohan lal), శివరాజ్ కుమార్(Shivaraj kumar), సునీల్(Sunil) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్(Anirudh) సంగీతం అందిస్తున్నారు.