రజనీకాంత్ ఎప్పుడూ నిజాలే మాట్లాడతారు.. తాజా ఇష్యూపై జగపతి బాబు కామెంట్స్

రజనీకాంత్ ఎప్పుడూ నిజాలే మాట్లాడతారు.. తాజా ఇష్యూపై జగపతి బాబు కామెంట్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడింది 100% నిజమే అని, ఆయన ఏం మాట్లాడిన నిజాలే మాట్లాడతారని ఫ్యామిలీ హీరో జగపతి బాబు అన్నారు.  ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం  రామబాణం. మ్యాచో స్టార్   గోపీచంద్ హీరోగా వస్తున్న ఈ మూవీ..  మే 5 శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో బాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు జగపతి బాబు.

ఇందులో బాగంగా విలేకరులు రజనీకాంత్ ఇష్యూని ప్రస్తావించగా..  ''రజనీకాంత్ చెప్పింది100% రైట్. నేను లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి వినలేదు. కానీ, ఆయన మాట్లాడే విధానం, తీరు పర్ఫెక్ట్ గా ఉంటుంది'' అని జగపతి బాబు సమాధానం ఇచ్చారు. ఇక 'కథానాయకుడు' సినిమాలో తొలిసారి రజనితో కలిసి నటించిన జగపతి బాబు..  ఆ తర్వాత లింగా, పెద్దన్న  సినిమాల్లో విలన్ రోల్స్ చేశారు. అయితే.. ఈ విషయంలో రజనికి సపోర్ట్ ఇవ్వడంపై  వైసీపీ నేతలు జగపతి బాబుపై  ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇక ఇదే విషయంపై ఇటీవల రజనీకాంత్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నటుడు పోసాని కృష్ణమురళి. ఎన్టీ రామారావు (NT Rama Rao) శత జయంతి (NTR 100th Birth Anniversary Celebrations) ఉత్సవాలలో పాల్గొన్న రజనీకాంత్.. చంద్రబాబుపై  పొగడ్తల వర్షం కురిపించాడు. దీంతో.. అధికార వైఎస్సాఆర్సీపీ పార్టీ నేతలు ఒక్కొక్కరూ రజనీపై  విమర్శలతో దాడి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా..  తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఎవరూ రజనీకాంత్ కిమద్దతుగా మాట్లాడకపోవడం చర్చనీయ్యాం అయ్యింది.