తలైవా బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న ఫ్యాన్స్

 తలైవా బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్  చేసుకున్న ఫ్యాన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు 72 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ  సందర్బంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రజినీ పుట్టిన రోజు వేడుకలను ఫ్యాన్స్ గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా  మధురైలోని రజనీ అభిమానులు 73 కిలోల బరువున్న 15 అడుగుల పొడవైన కేక్‌ను కట్ చేశారు. అయితే  కేక్‌పై 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అని రాసి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది.  తలైవా  రాజకీయాల్లోకి వచ్చినా,  రాకపోయినా  సూపర్ స్టార్‌గా మిగిలిపోతారని రజినీ అభిమానులు తెలిపారు.

బస్ కండక్టర్ శివాజీరావ్ గైక్వాడ్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ నేడు 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. తలైవాగా దేశ వ్యాప్తంగా రజనీగా పేరు తెచ్చుకున్నారు. నటనకు అందం అవసరం లేదని, టాలెంట్ ఉంటే ఎక్కడైనా నెగ్గుకురాగలమని నిరూపించారు. తన మ్యానరిజంతో, ప్రత్యేకమైన స్టైల్ తో అశేష అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోనూ మొదటి నుంచీ తన సత్తా కొనసాగిస్తూ ఈ రోజుకీ అంతే క్రేజ్ తో, ఫ్యాన్స్ ను సంపాదించుకుని పాపులారిటీతో రజనీ దూసుకుపోతున్నారు.