రజినీకాంత్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 170వ చిత్రం.. వెట్టైయన్‌‌‌‌‌‌‌‌

రజినీకాంత్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 170వ చిత్రం.. వెట్టైయన్‌‌‌‌‌‌‌‌

‘జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్ అందుకున్న రజినీకాంత్‌‌‌‌‌‌‌‌.. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. రజినీకాంత్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 170వ చిత్రం. మంగళ వారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా విషెస్ చెబుతూ ఈ మూవీకి ‘వెట్టైయన్‌‌‌‌‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ను ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేశారు. ‘చంద్రముఖి’ చిత్రంలో రజినీకాంత్ పోషించిన రాజు పాత్ర పేరు కూడా వెట్టైయన్‌‌‌‌‌‌‌‌. అంటే ‘వేటగాడు’ అని అర్థం.

ఇక టైటిల్‌‌‌‌‌‌‌‌తో పాటు విడుదల చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. గ్లాసెస్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవడం మొదలు గన్‌‌‌‌‌‌‌‌ కాల్చడం వరకూ తన మార్క్ స్టైల్, స్వాగ్‌‌‌‌‌‌‌‌తో రజినీకాంత్‌‌‌‌‌‌‌‌ ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌గా కనిపించారు. అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ స్కోర్ ఆకట్టుకుంది. వేటలో ఉన్నప్పుడు.. ఆహారం తప్పకుండా దొరుకుతుంది అనే అర్థం వచ్చేలా తమిళంలో రజినీ చెప్పిన డైలాగ్‌‌‌‌‌‌‌‌ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.

అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేశ్‌‌‌‌‌‌‌‌ కనగరాజ్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో నటించనున్నారు రజినీకాంత్. మరోవైపు రజినీ కీలకపాత్రలో ఆయన కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ‘లాల్ సలామ్‌‌‌‌‌‌‌‌’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.