
చాలాకాలం తర్వాత రజనీకాంత్ పోలీసు యూనిఫామ్ వేశారు. ఆయన పక్కన నయనతార హీరోయిన్‌గా చేస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ యాక్టర్స్ నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఒక్కటి కాదు… చెప్పుకోవాలే కానీ ప్రేక్షకుల అంచనాలను పెంచేసే విశేషాలు చాలానే ఉన్నాయి ‘దర్బార్’ విషయంలో. దానికి తోడు యూనిఫామ్‌లో రజనీ యాంగ్రీ ఫస్ట్ లుక్‌ని చూశాక ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడాయన సెకెండ్ లుక్ రిలీజయ్యింది. ఇది మొదటిదాన్ని మించి ఉంది. లుక్స్‌తోనే రజనీ, మురుగదాస్‌లో ఇంతగా మెప్పిస్తున్నారంటే.. థియేటర్‌లో ఇంకెంత ఎంటర్‌టైన్ చేస్తారో!