జైలర్ కోసం రజిని భారీ రెమ్యునరేషన్.. అవాక్కవుతున్న స్టార్స్

జైలర్ కోసం రజిని భారీ రెమ్యునరేషన్.. అవాక్కవుతున్న స్టార్స్

మరో మూడురోజుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా చేసినా జైలర్(Jailer) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. జైలర్ నుండి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెంచేశాయి. 

ఇక చాలా కాలంగా రజినీకాంత్ కు సరైన హిట్స్ లెవ్. అందుకే ఈ సినిమాపై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుక్కింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ ఆవుతోంది. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలు సూపర్ స్టార్ స్టామినా ఏంటా? అని చెప్పడానికి. 

ఇక తాజాగా ఈ సినిమా కోసం రజినీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం రజిని ఏకంగా రూ.110 కోట్ల భారీ మొత్తాన్ని పారితోషకంగా తీసుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న స్టార్ హీరోలు ఒక్కసారిగా అవాక్కవుతున్నారట. సీనియర్ స్టార్ హీరోలలో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా రజిని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. 

ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే.. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో.. రమ్య కృష్ణ, మోహన్ లాల్. శివరాజ్ కుమార్ కీ రోల్లో కనిపించనున్నారు. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుదొ చూడాలి.