
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్‌లో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జైలర్ (Jailer). నెల్సన్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదలై.. అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజ్ రోజు నుండే ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో..బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.
జైలర్ మూవీ రిలీజైన 10 రోజులకే వరల్డ్ వైడ్ గా రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది.ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి రూ.48.35 కోట్ల వసూళ్లతో రికార్డ్ ఓపెనింగ్ సాధించింది.ఇప్పటివరకు ఇండియాలో దాదాపు రూ.263.9 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తుంది.ఇక ఈ సినిమా గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ కూడా అంతే ఆకట్టుకుంటోంది. జైలర్ రూ.500 కోట్ల మార్కును దాటిన మూడవ తమిళ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్విట్టర్‌లో జైలర్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. జైలర్ కేవలం 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల ఎలైట్ క్లబ్‌ను చేరుకుంది. రజినీ 2.0 ఈ క్లబ్‌లోకి చేరిన రెండవ తమిళ మూవీగా ఉండగా..పొన్నియిన్ సెల్వన్: I ఏడు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ మూవీగా నిలిచింది.
దీంతో జైలర్ సినిమా కలెక్షన్స్ రోజురోజుకీ ఏ మాత్రం తగ్గడంలేదు. ఇవన్నీ చూస్తుంటే..రాబోయే రోజుల్లో జైలర్ సినిమా మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక జైలర్ సినిమాలో రజినీ చెప్పినట్టే..ఒక రేంజ్ తర్వాత మాటలుండవు..కోతలే అన్నట్టు వసూళ్లు కూడా అదే రేంజ్ వస్తున్నాయి.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చన జైలర్ సినిమాలో..తమన్నా, రమ్యకృష్ణ,సునీల్,యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాదు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు. ఇక అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. సన్ పిక్చర్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి.
జైలర్ కలెక్షన్స్
1వ వారం రూ.450.80 కోట్లు
2వ వారం
1వ రోజు -రూ.19.37 కోట్లు
2వ రోజు రూ.17.22 కోట్లు
3వ రోజు రూ.26.86 కోట్లు
మొత్తం -రూ.514.25 కోట్లు.