సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్(Jailer). ఆగస్టు 10న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విడుదలైన నాలుగురోజుల్లోనే ఏకంగా రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టి రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఫస్ట్ వీకెండ్ లోనే కాకుండా.. వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ముదులిపే కలెక్షన్స్ రాబడుతోంది జైలర్ మూవీ. ఇదే ఊపుకొనసాగితే మరో రెండు రోజుల్లో ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా జైలర్ మూవీ ఓటీటీ(Jailer OTT) రిలీజ్ కు సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సన్ నెక్స్ట్(Sun nxt) సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబందించిన డేట్ కూడా వచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. జైలర్ మూవీ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న 28 రోజుల తరువాత ఓటీటీలో రిలీజ్ కానుంది ఈ సినిమా. దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు.
ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే.. సన్ పిక్చర్(Sun pictures) భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ కుమార్(Nelson kumar) దర్శకత్వం వహించారు. రమ్య కృష్ణ(Ramyakrishna),తమన్నా(Thamannaah), సునీల్(Sunil), యోగిబాబు(Yogibabu) కీ రోల్స్ చేసిన ఈ సినిమాలో.. మళయాళ స్టార్ మోహన్ లాల్(Mohan lal). కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shivraj kumar) స్పెషల్ రోల్స్ లో కైనిపించి ఆడియన్స్ ను అలరించారు. ఇక లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. సినీమా విజయంలో కీలక పాత్ర పోషించింది.