కమల్‌-రజనీ మీటింగ్.. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ మూమెంట్

కమల్‌-రజనీ మీటింగ్.. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ మూమెంట్

జానర్ ఏదైనా, దర్శకుడు ఎవరైనా వీరిద్దరూ తమ తమ సినిమాలో నటిస్తున్నారంటే కచ్చితంగా అది ఓ డిఫరెంట్ మూవీయే అవుతుందని అందరి నమ్మకం. అందుకు తగ్గట్టే ప్రతి చిత్రంలో తమదైన సిగ్నేచర్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అలాగే కొందరు తమిళ యంగ్ డైరెక్టర్స్ కూడా తమ అభిమాన హీరోతో సినిమా తీయాలని కలలు కంటూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలో వారికంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు..వారే నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), రజనీకాంత్ (Rajinikanth). వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూపర్ స్టార్, లోకనాయకుడు కోట్లలో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. 

లేటెస్ట్ గా వీరిద్దరూవారి సినిమాల్లో భాగంగా ఓ స్టూడియోలో కలిశారు. దీంతో బ్రేక్ టైములో ఇద్దరు కలిసి కాసేపు సరదాగా ముచ్చటించుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు సూపర్ స్టార్స్.. అంటూ ఫ్యాన్స్ తమ ప్రేమను తెలుపుతున్నారు.

ప్రస్తుతం కమల్‌ హాసన్‌ నటిస్తోన్న ‘భారతీయుడు2’ (Indian 2) , రజనీకాంత్‌ నటిస్తోన్న తన 170వ చిత్రాన్ని (Thalaivar 170) ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions) నిర్మిస్తోంది. దీంతో వీరిద్దరూ ఒకేచోట కలుసుకోవడానికి వారధి అయ్యింది. వీరిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ..'ఇదే స్టూడియోలో మనం కలిసి ఎన్ని సంవత్సరాలైందని కమల్‌హాసన్‌ను రజనీకాంత్‌ అడగ్గా..21 సంవత్సరాలైందంటూ ఆయన సమాధానం చెప్పారు. ఈ ఫొటోలను షేర్‌ చేసిన లైకా ప్రొడక్షన్స్‌..లెజెండరీ నటుల సినిమాలను ఒకేసారి నిర్మించే అవకాశం రావడం చాలా గర్వంగా ఉందని..ట్వీట్ చేసింది. 

ఇక కమల్ హాసన్ ‘భారతీయుడు2’ సినిమా విషయానికొస్తే ..తమిళ డైరెక్టర్ శంకర్-కమల్‌ హాసన్‌ల కాంబోలో వచ్చిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఇండియన్ ఇంట్రో అదిరిపోయింది. ఇందులో హీరో సిద్ధార్థ్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీ దాదాపు రూ.350కోట్లతో తెరకెక్కుతోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలూ అందిస్తున్నారు.

అలాగే రజనీ కాంత్ (Rajinikanth) 170వ మూవీ విషయానికి వస్తే..జై భీమ్ ఫేమ్ టి.జి. జ్ఞానవేల్‌ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ..సామాజిక అంశాలతో తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీలో చాలా కీలకమైన రోల్స్ కోసం బిగ్ బి అమితాబ్, టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా, మలయాళ స్టార్ హీరో ఫహద్‌ ఫాజిల్, మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం తలైవర్ 170 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.