క్రికెట్‌, కమ్యూనిజం అల్లర్లతో..రజినీకాంత్ లాల్ సలామ్ టీజర్

క్రికెట్‌, కమ్యూనిజం అల్లర్లతో..రజినీకాంత్ లాల్ సలామ్ టీజర్

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) స్పెషల్ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam). ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్‌ (Vishnu Vishal), విక్రాంత్‌ సంతోష్‌ (Vikramnth santhosh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

లేటెస్ట్ ఈ సినిమా నుంచి హిందీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీపావళి సందర్బంగా రిలీజ్ చేసిన టీజర్ పవర్ ప్యాక్డ్ ఇంటెన్స్ ను క్రియేట్ చేస్తోంది. క్రికెట్‌, కమ్యూనిజం చుట్టూ జరిగిన అల్లర్లతో టీజర్ ఆసక్తి పెంచుతోంది. మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజినీ కనిపించిన తీరు, ఇంటెన్స్ లుక్స్ టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. అంతేకాకుండా..ఆద్యంతం ఆసక్తి కలిగించే పాత్రలతో తెరకెక్కించిన సీన్స్ గూస్బంప్స్ కలిగించేలా చేసింది ఐశ్వర్య. 

న‌టి జీవిత రాజశేఖర్ ఈ మూవీలో కీలక పాత్రతో రీ ఎంట్రీ ఇస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ మరొక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో భారీ స్థాయిలో లాల్ సలామ్ పై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆడియాన్స్ లో పెంచేయగా..టీజర్ రాకతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది. 

ఐశ్వర్య రజినీకాంత్ దాదాపు 6 ఏళ్ళ తరువాత డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో.. ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.