కాసేపట్లో ఇంట్లోకి వచ్చేస్తున్న జైలర్.. ఏ ఛానల్లో అంటే?

కాసేపట్లో ఇంట్లోకి వచ్చేస్తున్న జైలర్.. ఏ ఛానల్లో అంటే?

తలైవా రజనీకాంత్​ నటించిన ‘జైలర్’ (Jailer).​ సినిమా దీపావళి స్పెషల్ గా టీవీల్లోకి రాబోతుంది. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు జెమిని టీవీలో ప్రసారం కానుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రజినీకాంత్ కెరీర్​లోనే అత్యధికంగా రూ. 600 కోట్లకు పైగా  కలెక్షన్లను రాబట్టింది. 

ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్‌ ఇండియా జైలర్‌ మూవీ థియేటర్లోనూ, ఓటీటీలోను రిలీజై సత్తా చాటింది. ఇప్పుడు టెలివిజన్ లో భారీ టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్లడం కన్ఫర్మ్ అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. నెల్సన్‌ కుమార్‌ (Nelson Dilipkumar) దర్శకత్వం వహించిన ఈ భారీ సినిమాకు..సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌ (kalanithi Maran) నిర్మించారు. 

ప్రస్తుతం రజినీకాంత్ జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తలైవా170 మూవీతో పాటుగా..లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో తలైవా171 మరో మూవీ చేస్తున్నారు. ఈ సినిమాల కోసం ఏకంగా..రజినీ రూ.270 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో రజినీ ఆసియాలోనే అత్యంత రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్ గా నిలుస్తాడు. వయస్సు పెరిగే కొద్దీ..రజీని స్టామినా..ఆ స్వాగ్ అమాంతం పెరుగుతూ ఉండటంతో.. సూపర్ స్టార్ ఫ్యాన్స్' ఇది కదా తలైవా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.