రజినీ దర్బార్ ట్రైలర్ : ఐయామ్ ఎ బ్యాడ్ కాప్‌

రజినీ దర్బార్ ట్రైలర్ : ఐయామ్ ఎ బ్యాడ్ కాప్‌

మురుగదాస్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా దర్బార్. రజినీ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి-9న రిలీజ్ కానుంది. ముంబై మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌జినీకాంత్ ఆదిత్య అరుణాచ‌లం అనే ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్టర్ లో న‌టిస్తున్నాడు. భారీ వ్యయంతో లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై ఈ సినిమాను సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ట్రైల‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేసింది యూనిట్. ప‌క్కా మాస్, క్లాస్ ప్రేక్ష‌కుల‌ను, అభిమానులను ఆకట్టుకునేలా సినిమా ట్రైల‌ర్‌ ఆక‌ట్టుకుంటోంది. ఆదిత్య అరుణాచ‌లంగా ర‌జినీకాంత్ ఎంట్రీ ఆక‌ట్టుకుంటుంది. “పోలీస్ ఆఫీస‌రా సార్ వాడు… హంత‌కుడు. పోలీస్ అనేది ఉద్యోగం కాదు.. అత‌ను కాపాడ‌టానికి జీవిస్తాడు..సేవ చేయ‌డానికి చ‌స్తాడు. ముంబై పోలీసులు ప్రాణాల‌కు భ‌య‌ప‌డ‌తార‌ని మ‌ళ్లీ నిరూపిస్తా. గేమ్ ఆడుతున్నారా.. నాద‌గ్గ‌రే. సార్ వాళ్లకి చెప్పండి. పోలీసుల‌ను లెఫ్ట్‌లో, రైట్‌లో రావచ్చు స్ట్రయిట్‌గా రావద్దని..ఒరిజిన‌ల్‌గానే నేను విల‌న్‌ని.. ఐయామ్ ఎ బ్యాడ్ కాప్‌” అని ర‌జినీకాంత్ ప‌వ‌ర్‌ ఫుల్ డైలాగ్స్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. మ‌రో ప‌క్క సునీల్ శెట్టి విల‌నిజం ప‌వ‌ర్‌ ఫుల్‌ గా ఉంది.

దర్బార్ ట్రైలర్ ను మీరు ఓ లుక్కేయండి