రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు.. విజయ్ గురించేనా..

రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు.. విజయ్ గురించేనా..

సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందని రజినీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీ... ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. నిజానికి రజినీ వ్యాఖ్యల వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేనప్పటికీ.. ఈ కామెంట్స్ హీరో విజయ్ ను ఉద్దేశించినవే అన్న వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. 

ఇటీవలే హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటమే రజినీకాంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారటానికి కారణమని చెప్పచ్చు. మరి, తన వ్యాఖ్యలపై రజినీకాంత్ వివరణ ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. గతంలో రజినీకాంత్ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఏ కారణం చేతనో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కార్యరూపం దాల్చలేదు.

ఇదిలా ఉండగా.. రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పరోక్షంగా డీఎంకే పార్టీకి దగ్గరగా ఉంటున్నారని చాలాకాలంగా టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు డీఎంకే పార్టీకి సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటానికి కూడా అదే కారణమని టాక్ వినిపిస్తోంది. మరి, రజనీకాంత్ పొలిటికల్ కామెంట్స్ తమిళనాట ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.