
- కలలో కూడా అధికారంలోకి రాలేరని ప్రభుత్వానికి హెచ్చరిక
చెన్నై: లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ ఫైర్ అయ్యారు. తమిళనాడులో రోజురోజుకు కరోనా కేసులు నమోదవతున్న ఇటువంటి పరిస్థితుల్లో మందు దుకాణాలు ఓపెన్ చేస్తే ఏఐఏడీఎంకే కలలో కూడా అధికారంలోకి రాదని హెచ్చరించారు. మద్యం కావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదని, ఆదాయం కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదివారం ట్విట్టర్ లో సూచించారు. సోషల్ డిస్టెన్స్ ప్రొటోకాల్ ఉల్లంఘించిన కారణంగా టాస్మాక్ (తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్) ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కేవలం ఆన్లైన్ లోనే అమ్మకాలు చేపట్టాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరుసటిరోజు రజినీకాంత్ ఈ కామెంట్స్ చేశారు.