లాల్ సలామ్ డబ్బింగ్ కంప్లీట్

లాల్ సలామ్ డబ్బింగ్ కంప్లీట్

సూపర్ స్టార్ రజినీకాంత్ 72 ఏళ్ల వయసులోనూ  సూపర్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వాటిలో ‘లాల్ సలామ్’ ఒకటి. ఆయన కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తోన్న  ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తుండగా, రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ఆదివారంతో ఆయన పాత్రకు సంబంధించి డబ్బింగ్‌‌ను కంప్లీట్ చేశారు రజినీకాంత్. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో రజినీ తనదైన స్టైల్‌‌లో డబ్బింగ్ చెప్పగా.. ఐశ్వర్య టేక్ ఓకే చెబుతుంది. 

ఇందులో మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజినీ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఆయన లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ 171వ చిత్రాన్ని రీసెంట్‌‌గా అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై కళానిధి మారన్ దీన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్‌‌కి వెళ్లనుంది.