
అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. బీస్ట్ మూవీ ఫేమ్ నెల్సన్ దిలీప్ కూమార్ లో రజినీ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘జైలర్’ అనే టైటిల్ ను ఖారరు చేశారు. రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో ఒక చైన్‌కు రక్తం అంటుకున్న కత్తిని వేలాడదీసి ఉంది. యాక్షన్-థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
#Thalaivar169 is #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/tEtqJrvE1c
— Sun Pictures (@sunpictures) June 17, 2022