కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ లీడర్లు

కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ లీడర్లు
  • జడ్పీ ఉపాధ్యక్షురాలు రజితాయాదవ్ ఘర్​వాపస్​ అదేబాటలో సిటీలోని కార్పొరేటర్ల భర్తలు, మాజీ కార్పొరేటర్లు

నెట్​వర్క్, వెలుగు: జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజితాయాదవ్ గురువారం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్​లో చేరారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి హైదరాబాద్​లోని తన ఇంట్లో ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎంపీపీగా పనిచేసిన రజితాయాదవ్, 2018లో బీఆర్ఎస్​లో చేరారు. జడ్పీటీసీగా గెలిచి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. రజితాయాదవ్ భర్త ఎల్లయ్య యాదవ్ పదేండ్ల పాటు ఎడపల్లి సర్పంచ్ గా, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు భార్యభర్తలిద్దరూ ఘర్​వాపసీ అయ్యారు.

అర్బన్​లో కార్పొరేటర్ల భర్తలు..

నిజామాబాద్ కార్పొరేషన్​కు చెందిన మహిళా కార్పొరేటర్ల భర్తలు పంచారెడ్డి సూరి, అరుణ్, నుడా డైరెక్టర్ కన్నా బాలాజీ, మాజీ కార్పొరేటర్లు కొండపాక రాజేశ్, బొబ్బిలి మురళి, పురుషోత్తం గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. వారి వెంట నాయిని సృజన్, మార ప్రభు, అనీల్​యాదవ్, గంగరాజు, రవి, నర్సింహా, బీఎల్ రాజు కూడా కాంగ్రెస్​ కండువాలు కప్పుకున్నారు.

Also read : నందికొండ చైర్‌‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం

ఆర్మూర్​లో సింగిల్ విండో చైర్మన్

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ సింగిల్ విండో చైర్మన్ పెంట భోజారెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్​లో చేరారు. డైరెక్టర్లు చింతకుంట రాజు, కటిక శ్రీనివాస్​తో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు డేర మోహన్, టౌన్ వైస్​ప్రెసిడెంట్​ సుభాష్​గౌడ్​ను సెగ్మెంట్ ఇన్​చార్జి వినయ్​రెడ్డి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు.