ఆర్ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్  హెడ్‌గా రాజీవ్ ఖుల్బే

ఆర్ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్  హెడ్‌గా రాజీవ్ ఖుల్బే

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫర్టిలైజర్స్  అండ్  కెమికల్స్​ లిమిటెడ్(ఆర్ఎఫ్​సీఎల్) ప్లాంట్  హెడ్​గా రాజీవ్​ ఖుల్బే నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కెమికల్​ టెక్నాలజీలో కాన్పూర్‌‌  ఐఐటీ నుంచి బీటెక్‌  పూర్తి చేసిన ఆయన మూడు దశాబ్దాలుగా ఎరువుల ఉత్పత్తి రంగంలో పని చేస్తున్నారు.

1988లో నేషనల్​ ఫర్టిలైజర్స్​ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్)లో మేనేజ్​మెంట్​ ట్రైనీగా కెరీర్​ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగారు. ఆయనకు వివిధ విభాగాలకు చెందిన ఆఫీసర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్‌ను సమర్థంగా నడిపిస్తూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఎరువుల కొరత తీర్చడంలో కీలకంగా వ్యవహరిస్తానని తెలిపారు.