
నిర్మల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజీవ్ సద్భావన జ్యోతి యాత్ర గురువారం నిర్మల్కు చేరుకుంది. యాత్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. స్థానిక మంచిర్యాల చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌక్ వరకు జరిగిన యాత్రలో రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన సేవలను, ఆయన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
దేశ సంఘటితం కోసం ఆయన కృషి చేశారని అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, ఆత్మ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు కొట్టే శేఖర్, సుదర్శన్, పూదరి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.