రాజ్ నాథ్ సింగ్ కు రక్షణ శాఖ

రాజ్ నాథ్ సింగ్ కు రక్షణ శాఖ

కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. రాజ్ నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ, అమిత్ షాక్ హోంశాఖ కేటాయించారు. మరోవైపు గడ్కరీకి రోడ్డు, రవాణా శాఖ, సదానంద గౌడకు ఎరువులు, రసాయనాల శాఖను ఇచ్చారు. అటు రాంవిలాస్ పాశ్వన్ కు వినియోగదారుల వ్యవహరాల శాఖను ఇచ్చారు.

17వ లోక్‌సభలో 25 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదా మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

రాజ్ నాథ్ ప్రొఫైల్ :

ఫిజిక్స్ మాజీ ప్రొఫెసర్ అయిన రాజ్ నాథ్.. 2009-13, 2013-14 మధ్య పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వానీ వంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ .. 2014లో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంలో రాజ్‌నాథ్ కీలకంగా వ్యవహరించారు. RSS జీవిత కాల సభ్యుడైన ఆయన ఆ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2000-2002 మధ్య ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. వాజపేయి ప్రభుత్వంలో ఉపరితల రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 2009లో తొలిసారి ఘజియాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014, 19లో లక్నో నుంచి వరుసగా గెలుపొందారు.