ఇంధన దిగుమతి భారంగా మారింది: రాజ్ నాథ్ సింగ్

ఇంధన దిగుమతి భారంగా మారింది: రాజ్ నాథ్ సింగ్

సైబర్ వార్తో దేశం సవాళ్లను ఎదుర్కొంటుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ లో జరిగిన కాన్వొకేషన్ వేడుకల్లో మాట్లాడారు. రష్యా–ఉక్రెయిన్ వార్తో ప్రపంచానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

ఈ యుద్ధం వల్ల ఆఫ్రికన్, ఆసియా దేశాలలో ఆహార సంక్షోభం వచ్చిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారి తీసిందని వ్యాఖ్యానించారు. భారతదేశంలో కూడా యుద్ధం ప్రభావం పడిందని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఇంధన దిగుమతి భారంగా మారిందని అన్నారు.