ఫ్రీగా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీ టికెట్లు.. భారీ సక్సెస్తో నిర్మాత బంపర్‌ ఆఫర్‌.. ఈ ఒక్కరోజు మాత్రమే!

ఫ్రీగా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీ టికెట్లు.. భారీ సక్సెస్తో నిర్మాత బంపర్‌ ఆఫర్‌.. ఈ ఒక్కరోజు మాత్రమే!

చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అయిన లేటెస్ట్ మూవీ ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Rambai). ఈ విలేజ్ రస్టిక్ లవ్ స్టోరీకి ప్రేక్షకులంతా ఎమోషనల్‌‌గా కనెక్ట్ అవుతున్నారు. విడుదలైన ప్రతి సెంటర్‌‌‌‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయి, ఆ ప్రేమను వద్దనే తండ్రి.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ కథకు సరెండర్ అవుతున్నారు. ముఖ్యంగా ఇందులో నటించిన అఖిల్ రాజ్, తేజస్విని పోషించిన పాత్రలకు ఎంతో ఆదరణ వస్తుంది. దర్శకుడు సాయిలు రాసుకున్న కథ, కథనాలకు కదిలొస్తున్నా ప్రేక్షకులకు.. బంపర్ ఆఫర్ ఇచ్చారు ఈ సినిమా నిర్మాత వేణు ఊడుగుల (Venu Udugula).

ఇవాళ గురువారం (నవంబర్ 27న) ఏపీ, రాయలసీమల్లో కొన్ని ఫేమస్‌ థియేటర్‌లలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ని ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు నిర్మాత. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ నిర్మాత వేణు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘థియేటర్ ఎంచుకోవడం.. కౌంటర్ దగ్గరకు వెళ్లడం, ఫ్రీగా టికెట్ తీసుకోవడం.. రాజు రాంబాయిలని కలవడం’ అని తెలిపారు.

అయితే, ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. కేవలం మహిళలకు మాత్రమే ఈ ఫ్రీ టికెట్లు అని వేణు వెల్లడిస్తూ.. ఆ సదరు థియేటర్ల లిస్ట్ పోస్ట్ చేశారు. ఇక ఆలస్యం ఎందుకు లేడీ మూవీ లవర్స్.. రాజు రాంబాయిలని కలిసి రండి. అయితే, ఈ ఆఫర్ తెలంగాణాలో కూడా ఇస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ఈ క్రమంలోనే లేటెస్ట్గా జరిగిన సినిమా సక్సెస్ ఈవెంట్లో వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం అవమానాలు పడ్డాం.  రిలీజ్ ముందు ఓ నిర్మాతకు చూపిస్తే తన ఫ్రెండ్స్‌‌తో వచ్చి ఇంటర్వెల్‌‌కు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. అది మా క్రియేటివిటీని అవమానించడమే. పైగా ఇదేం సినిమా ఆడదంటూ నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ ఈరోజు ప్రేక్షకులు మా చిత్రాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. సాయిలు తెలుగు ఇండస్ట్రీకి ఒక వెట్రిమారన్, మారి సెల్వరాజ్ అవుతాడు’ అని చెప్పారు.

‘రాజు వెడ్స్ రాంబాయి’ వసూళ్లు:

డైరెక్టర్, నిర్మాత వేణు ఊడుగుల నిర్మించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. 5 రోజుల్లోనే ఈ సినిమాకు రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.9 కోట్లకి పైగా నెట్ సాధించి దూసుకెళ్తోంది. పెద్దగా హీరో, హీరోయిన్స్ లేరు.. డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు.. కానీ, సినిమా కంటెంట్ మాత్రమే కింగ్ అని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించుకుంది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే.. ఇంకో 10 రోజులు బాక్సాఫీస్ ని శాసించే సత్తా కంటెంట్ కి ఉంది.