రాజు యాదవ్ నుంచి మొదటి పాట రిలీజ్

రాజు యాదవ్ నుంచి మొదటి పాట రిలీజ్

‘జబర్దస్త్’ కమెడియన్ గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణమాచారి దర్శకుడు. కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ విడుదల కాగా, మొదటి పాటను గురువారం విడుదల చేశారు. దర్శకుడు బాబీ ఈ పాటని లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘నన్నే చూశావే.. నువు నన్నే నన్నే చూసినవే.. నవ్వే నవ్వావే.. చిరు నవ్వుల దారి చూపినవే’ అంటూ మొదలైన ఈ మెలోడియస్‌‌ సాంగ్‌‌ను హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేశాడు. 

‘రాజు యాదవ్ నేడు.. నీ రాస్తాలోకి వచ్చాడు, రాజు యాదవ్ వీడు.. నిన్ను రాణిని చేసేస్తాడు..’ అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్, రామ్ మిరియాల వాయిస్ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలిచాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ మూవీ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు తెలియజేశారు.