అచ్ఛే దిన్ ఎక్కడ ?.. మోదీకి ఎంపీ కపిల్ సిబల్ ప్రశ్న

అచ్ఛే దిన్ ఎక్కడ ?.. మోదీకి ఎంపీ కపిల్ సిబల్ ప్రశ్న

న్యూఢిల్లీ: దేశంలో  పదేండ్లుగా మోదీ అధికారంలో ఉన్నా ఇంకా అవినీతి అంతం కాలేదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. వచ్చే ఐదేండ్లు దేశానికి గోల్డెన్ పీరియడ్ అని ప్రకటించిన ప్రధాని.. అది పేదలకా, దళితులకా, మైనార్టీలకా లేక ఇంకెవరికైననా అనే విషయాన్ని చెప్పలేదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కపిల్ సిబల్ బుధవారం ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు. 
“ఆగస్టు 15న మోదీ మాడ్లాడు తూ.. మనం అవినీతిని అంతం చేయాలని అన్నారు. కానీ దేశంలో మీరు(మోదీ) దాదాపు పదేండ్లుగా అధికారంలో ఉన్నా రు కదా..! ఇంకా ఆ పని ఎందుకు చేయలే దు. దేశంలో 'అచ్ఛే దిన్' ఎక్కడ? అసలు మీకు గుర్తుందా.. మరిచారా?. దేశంలోకి కూరగాయలు కాదు.. ఇన్​ఫ్లేషన్ దిగుమతి  అవుతోంది. వచ్చే ఐదేండ్లు గోల్డెన్ పీరియడ్ అన్నారు. పేదలకా, దళితులకా, మైనార్టీలకా లేదా ఇంకెవరి కైననా..? ” అని మోదీని సిబల్ నిలదీశారు.