బీజేపీలో TDLP విలీనం పూర్తి : రాజ్యసభలో సై’కిల్’

బీజేపీలో TDLP విలీనం పూర్తి : రాజ్యసభలో సై’కిల్’

రాజ్యసభలో టీడీపీ ఖేల్ ఖతం అయింది. ఆ పార్టీ లెజిస్లేచర్ పార్టీని… బీజేపీలో విలీనం చేయాలంటూ తెలుగుదేశం ఎంపీలు ఇచ్చిన విన్నపాన్ని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆమోదించారు.

టీడీపీ రాజ్యసభా పక్ష నాయకుడు సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఎంపీలు టీజీ వెంకటేశ్, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు గురువారం రోజున చైర్మన్ వెంకయ్యనాయుడును కలిశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని నిర్ణయించుకున్నామనీ.. రాజ్యసభ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని.. బీజేఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ ఓ లెటర్ ను అందించారు. మొత్తం ఆరుగురు టీడీపీ ఎంపీల్లో 2/3 వంతు సభ్యులు విలీన ప్రతిపాదన చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం మెర్జర్ ప్రక్రియను ఆమోదిస్తూ.. రాజ్యసభ అధికారులు ప్రకటన విడుదల చేశారు. చైర్మన్ ఆమోదంతో.. ఆ నలుగురు టీడీపీ ఎంపీలు ఇకనుంచి బీజేపీ ఎంపీలుగా మారినట్టయింది.