రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు

శాంతిపూర్వకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నామన్నారు రాకేశ్ తికాయత్. దేశంలో ఏ రైతుకు మద్దతు ధర దక్కడం లేదన్నారు. MSP వస్తే దేశవ్యాప్తంగా రైతులు లాభపడుతారని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు రైల్ రోకో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 3 నుంచి 4 గంటల వరకు ఆందోళనలు కొనసాగుతాయన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని దుహాయ్ లో రైల్ రోకోలో పాల్గొననున్నారు రాకేశ్. దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. ఎన్నికలతో  రైతుల ఆందోళనలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు రాకేశ్ తికాయత్. ఆందోళనల్లో హింసను ఏ రూపంలోనూ అనుమతించబోమన్నారు.  రైల్ రోకో  శాంతియుతంగా జరుగుతుందన్నారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు తాము నీరు, పాలు, లస్సీ & పండ్లను అందిస్తామన్నారు.