కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై చర్చించలేదు

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై చర్చించలేదు

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కేసీఆర్ తో చర్చించామన్నారు తికాయత్.ఈ సమావేశంలో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి ఆయనతో చర్చించలేదన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ తోపాటు అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..అన్నదాతల కోసం ప్రత్యామ్నాయ నూతన విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు.ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పన కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని..అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ను కలిశానన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తానన్నారు.రైతాంగం కోసం హైదరాబాద్ గానీ మరోచోట అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తామన్నారు. 

మరిన్ని వార్తల కోసం

 

లండన్ నుంచి భారత్కు.. సద్గురు బైక్ యాత్ర

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్