
ఉమ్మడి మెదక్‌జిల్లా వ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే మహిళలు సోదరులకు రాఖీ కట్టడానికి పరుగులు పెట్టారు. దీంతో పట్టణాల్లోని బస్టాండులు కిటకిటలాడాయి. రాఖీ, స్వీట్ షాపులు రద్దీగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డికి రామచంద్రపురం కార్పొరేటర్పుష్ప, బీసీ కమిషన్ మెంబర్ రంగు బాలలక్ష్మి రాఖీ కట్టగా, హుస్నాబాద్క్యాంపు ఆఫీసులో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు స్థానిక మహిళా నాయకులు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు.
మంత్రి దామోదర రాజనర్సింహకు మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ సిబ్బంది రాఖీ కట్టి విషెస్ చెప్పారు. బీఆర్ఎస్నాయకులు కేటీఆర్‌కు భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డి, హరీశ్‌రావుకు మునిపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పైతర మీనాక్షి రాఖీ కట్టారు. కాంగ్రెస్‌నేత కాట శ్రీనివాస్‌గౌడ్‌కు ఇందిరాశోభన్, హరికృష్ణకు పార్టీ మహిళా కార్యకర్తలు రాఖీ కట్టారు.
- వెలుగు, నెట్వర్క్