
తెలుగులో చేసిన మన్మథుడు–2(Manmadudu2) సినిమా రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh) కెరీర్‌ను ఇరకాటంలో పడేసింది. ఈ మూవీ డిజాస్టర్‌తో బాలీవుడ్ బాట పట్టిన రకుల్ ప్రస్తుతం అక్కడ బిజీ హీరోయిన్గా మారింది. ఇటీవల ఈ అమ్మడు ఓ లగ్జరీ కారు కూడా కొనేసింది. దాదాపు రూ.3 కోట్లు పెట్టి మెర్సిడెస్ బెంజ్ మేబాక్ జీఎల్ఎస్ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ALSO READ :ఇతను షారుఖ్ ఖాన్ కాదు.. నమ్మరా?.. అయితే ఇది చూడండి
ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా రకుల్ కు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. దీంతో బాలీవుడ్లో ఈ హీరోయిన్‌కు బాగానే వర్కవుట్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ‘బూ’ అనే సిరీస్‌తో ఓటీటీలోకి కూడా రకుల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో ‘మేరే హస్బెండ్కీ బీవీ’, అజయ్ దేవగణ్‌తో ‘దేదే ప్యార్ దే–2’లో ఈ పంజాబీ బ్యూటీ నటిస్తోంది. దీంతో ఇప్పట్లో తెలుగులో రకుల్‌ను చూసే చాన్స్ లేనట్టే తెలుస్తోంది.