Rakul Preet Singh: సైతాన్ దిమ్మతిరేగేలా..ఒళ్లు గగుర్పొడిచేలా..అదిరిపోయిన రకుల్ రివ్యూ

Rakul Preet Singh: సైతాన్ దిమ్మతిరేగేలా..ఒళ్లు గగుర్పొడిచేలా..అదిరిపోయిన రకుల్ రివ్యూ

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn), మాధవన్ (Madhavan), జ్యోతిక (Jyotika) లీడ్‌‌ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం సైతాన్‌ (Shaitaan)‌. క్వీన్, సూపర్ 30, గుడ్ బై లాంటి చిత్రాలను తీసిన వికాస్ బహెల్ ఈ సినిమాని తెరకెక్కించాడు.

సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో నిన్న (మార్చి 8న) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద దూసుకెళ్తోంది. బాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లో ఫస్ట్ డే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన హార‌ర్ మూవీగా సైతాన్ రికార్డ్ క్రియేట్ చేసింది.

లేటెస్ట్గా సైతాన్ మూవీని చూసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తనదైన థ్రిల్లింగ్ ఫీలింగ్ని X ఖాతాలో పంచుకుంది. 

'సైతాన్ సినిమా దిమ్మతిరేగేలా..ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే నేరేటివ్ అద్భుతం. అద్భుతమైన నటీనటులు..ఒళ్ళు గగుర్పొడిచే పెర్ఫార్మన్స్ తో కళ్లు పక్కకు తిప్పకుండా సీటుకు అతుక్కుపోయానని రకుల్ రివ్యూ ఇచ్చేసింది. మొత్తానికి సైతాన్  అత్యద్భుతంగా ఉంది. అజయ్ దేవ్‍గణ్, జ్యోతిక, మాధవన్, కిడ్స్..టీమ్ మొత్తానికి కాంగ్రాచులేషన్స్” అని రకుల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

సైతాన్ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.14.50 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. గ‌తంలో బాలీవుడ్‌లో హారర్ సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ చేసిన మూవీగా ఇమ్రాన్ హ‌ష్మీ నటించిన రాజ్ 3 పేరిట నెలకొన్న రికార్డ్ ను సైతాన్ బ్రేక్ చేసింది.

మూడు రోజుల్లో సైతాన్ కలెక్షన్స్ చూసుకుంటే..భారత్‍లో రూ.50 కోట్ల మార్కును దాటేసింది. మూడో రోజైన ఆదివారం ఈ మూవీ రూ.20.50 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో ఇండియాలో ఈ చిత్రానికి మూడో రోజుల్లో రూ.54.89 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక విదేశాల్లో ఈ మూవీకి ఇప్పటి వరకు సుమారు రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సైతాన్ క‌థ:

క‌బీర్ (అజ‌య్ దేవ్‌గ‌ణ్‌), జ్యోతి(జ్యోతిక‌) త‌మ కూతురు జాన్వీతో క‌లిసి వెకేషన్ కోసం ఓ మారుమూల గ్రామానికి వెళ‌తారు.ఓ అపరిచిత వ్యక్తి ఆప్తుడిగా క‌బీర్‌కు ప‌రిచ‌యం అవుతాడు వ‌న్‌రాజ్ (మాధ‌వ‌న్‌). ఇక అతని కారణంగా క‌బీర్ ఫ్యామిలీ చిక్కుల్లో ప‌డుతుంది. త‌న మాయ‌లు, మంత్రాల‌తో క‌బీర్ ఫ్యామిలీని వ‌న్‌రాజ్ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఆడియాన్స్లో ఇంట్రెస్ట్ పెంచుతోంది ఈ సినిమా. 

ALSO READ | Salaar: డబ్బులు తిరిగి ఇచ్చేసిన సలార్ నిర్మాత.. కారణం ఏంటంటే?

మాధ‌వ‌న్ ఒక సైతాన్ గా మారి అజయ్ దేవ‌గ‌న్ కుమార్తెను వ‌శ‌ప‌రుచుకుంటాడు. యువ‌తిపై వ‌శీక‌ర‌ణ మంత్రాన్ని ప్ర‌యోగిస్తాడు. అనూహ్యంగా ఆ యువ‌తి ఇంట్లోనే అత‌డు సాగించే భ‌యాన‌క‌మైన ఆట ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే